Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్‌డే

స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్‌డే

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల స్వాగత కార్యక్రమం (ఫ్రెషర్స్‌ డే) వేడుకలు శనివారం హైదరాబాద్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరంలో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల స్టూడెంట్‌ సపోర్ట్‌ సిస్టం డైరెక్టర్‌ వి అనురాధ పర్యవేక్షించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ బి ఎల్‌ రాజు మాట్లాడుతూ కొత్తగా అడుగుపెట్టిన మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ నాలుగేండ్ల ప్రయాణంలో సంపాదించే జ్ఞానం, అనుభవం, స్నేహ సంబంధాలు, జీవితాంతం ఉంటాయని అన్నారు. ఇంజినీరింగ్‌ విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదనీ, ఇది ఆవిష్కరణలకు, సమస్య పరిష్కారాలకు, సమాజ సేవకు ఒక పునాది అని వివరించారు. తరగతి గదిలో నేర్చుకునే విషయాల కంటే ఎక్కువగా సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, ప్రాజెక్టుల్లోనూ, టీం వర్క్‌లోనూ పొందే అనుభవం ఒక పూర్తి ఇంజినీర్‌గా తీర్చిదిద్దుతుందని చెప్పారు. డైరెక్టర్‌ వి అనురాధ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమనీ, వాటి వల్లే సృజనాత్మకత పెంపొందుతుందని అన్నారు. కేవలం మార్కుల కోసమే చదవకుండా, నిజమైన జ్ఞానం కోసం ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కార్యదర్శి, కరెస్పాండెంట్‌ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేష్‌రెడ్డి, ఆర్‌ ప్రదీప్‌రెడ్డి, డీన్‌ ఏ వినరుబాబు, వైస్‌ ప్రిన్సిపల్‌ బివి రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -