నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ హైస్కూల్లో ( పరిచయ్) ఫ్రెషర్స్ డే సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించినారు. పాఠశాలలో ఈ నూతన సంవత్సరంలో కొత్తగా చేరినటువంటి విద్యార్థిని విద్యార్థులకు (పరిచయ్) ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి వారికి స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు , ప్రిన్సిపల్ కాంతి గంగా రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా చేరినటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఇష్టపడుతూ కష్టపడాలని అన్నారు. సబ్జెక్ట్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటూ క్రమశిక్షణను అలవర్చుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం డైరెక్టర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి విద్యార్థిని స్కూల్ స్థాయి నుంచి కష్టపడడం అలవర్చుకుంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కాంతి పాఠశాలలో ప్రెషర్స్ డే సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES