నవతెలంగాణ – జుక్కల్ : మండల పరిధిలోని ఖండేబల్లూరు గ్రామంలో శుక్రవారం ఫ్రైడే.. డ్రై డే కార్యక్రమంలో భాగంగా జుక్కల్ ఎంపీఓ రాము నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు , వాటర్ ట్యాంకుల శుభ్రత , మురికి కాలువలు వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయడం గురించి గ్రామస్తులకు అవగాహన చేశారు. గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వీధుల గుండా తిరుగుతూ పరిశుభ్ర లోపం ఉన్నచోట నివాసముంటున్న ఇంటి వారిని పిలిపించి, ఇల్లుతో పాటు పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సఫాయి కార్మికుల చేత శుభ్రం చేయించారు. దోమలు నివాసం ఉండే ప్రాంతాలలో నీటి గుంతలను మట్టి వేసి కప్పించారు.
వాటర్ ట్యాంకులు, కులాయిల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా జిపి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. దోమల వలన వచ్చే మలేరియా జ్వరాల గురించి గ్రామస్తులకు వివరించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ తో పాటు జిపీ కార్యదర్శి , ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఖండే బల్లూర్ లో ఫ్రైడే.. డ్రైడే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES