నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
ఇటీవల మరణించిన తమ చిన్ననాటి స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు చిన్ననాటి స్నేహితులు ముందుకొచ్చారు. కలిసి చదువుకున్న, ఆడుకున్న మిత్రుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న స్నేహితులంతా ఒకటయ్యారు. బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన డి మహేందర్ ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు తమ కుటుంబానికి చేయుతగా రూ.23 వేల 500 బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా మృతుని పాత స్నేహితులు మాట్లాడుతూ.. డబ్బుతో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మా బాధ్యత” అని స్నేహితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్నేహితులంతా కలిసి తమ శక్తి మేరకు విరాళాలు సేకరించి సుమారు రూ. 23వేల నగదును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ మిత్రుడి జ్ఞాపకార్థం కుటుంబానికి భరోసా కల్పించిన ఈ స్నేహితుల చొరవను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్, విజయ్, గంగరాజులు, విఠల్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుడు మృతి.. కుటుంబానికి అండగా మిత్రబృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



