నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలీ జిపి గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్ నాగనాథ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కరాచరణం చేసి స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ అనేది ఒక మంచి క్రీడా పండుగగా నిలవబోతోందని, ఇది మనందరికీ గర్వకారణం అని తెలిపారు. అలాగే ఉప సర్పంచ్ బాబు రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై యువతకు ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు .
గ్రామ యువతలో క్రీడా స్పూర్తి, ఐక్యత, స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు చాలా ఉపయోగపడతాయి. గెలుపు-ఓటములు సహజం, కానీ మనం క్రీడాస్ఫూర్తితో ఆడటం ముఖ్యమైనది అని , ఇటువంటి విద్వేషాలకు పోకుండా సామరస్యంగా పోటీలను క్రీడాకారులకు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న క్రికెట్ మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు ప్రవీణ్, పాండు, బిరదార్, మోసిన్, జ్ఞానేశ్వర్ వాఘ్మారే, మారుతి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు.
వారి కృషి వల్లే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతోందని ఆశించి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాల్గొంటున్న అన్ని టీమ్స్‌కు మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందరూ క్రీడాస్ఫూర్తితో ఆడి ప్రేక్షకులకు మంచి వినోదం అందించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామ అభివృద్ధికి, యువత ప్రోత్సాహానికి ఎంతో దోహదం చేస్తాయి అని సూచించారు. చివరగా… ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రారంభిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు.



