ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఘటన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మాడుకు చెందిన ఆముదాల రాము, షేక్ జానీ ఇద్దరు స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బుధవారం రాత్రి మద్యం సేవించి ఈ క్రమంలో పురుగుల మందూ తాగారు. గ్రామంలో రోడ్డుపై పడి ఉండగా స్థానికులు గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాము పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జానీకి మధిర సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, పోలీస్ స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రమేష్ కుమార్ తెలిపారు.