Saturday, August 2, 2025
E-PAPER
Homeసినిమామిత్రులు.. రాజకీయ ప్రత్యర్థులైతే?

మిత్రులు.. రాజకీయ ప్రత్యర్థులైతే?

- Advertisement -

వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అను భూతిని అందిస్తోన్న సోనీ లివ్‌ నుంచి రాబోతున్న వెబ్‌ సిరీస్‌ ‘మయసభ : రైజ్‌ ఆఫ్‌ ది టైటాన్స్‌’. దేవా కట్టా, కిరణ్‌ జయ కుమార్‌ దర్శ కత్వంలో హిట్‌ మ్యాన్‌ అండ్‌ ప్రూడోస్‌ ప్రొడక్షన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్స్‌పై విజరు కష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన ఈ సిరీస్‌ను ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ, ”ఆటోనగర్‌ సూర్య’ చూసిన వెంటనే దేవాకి ఫోన్‌ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్‌’కి వచ్చింది. ‘రిపబ్లిక్‌’ టైంలో జరిగిన ఘటనలో నాకు ఎప్పుడూ అండగా నిలిచారు. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ’30 వెడ్స్‌ 21′ చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు (నవ్వుతూ). అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ‘రిపబ్లిక్‌’ టైంలో సాయి కుమార్‌ నాకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. ఈ సిరీస్‌ అద్భుతాలు సష్టించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
”మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ‘స్కామ్‌, మహారాణి’ వంటి ఎన్నో సెన్సేషనల్‌ సిరీస్‌లను సోనీ లివ్‌ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్‌ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్‌ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్‌ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్‌ జనాల్లోకి వెళ్లింది’ అని దేవా కట్టా చెప్పారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ, ‘పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న ప్రాజెక్ట్‌ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’లా ‘మయసభ’ నిలిచిపోతుంది’ అని తెలిపారు. ‘దివ్య, నాజర్‌, సాయి కుమార్‌ వంటి యాక్టర్లతో పని చేయడం అదష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఈ ఇండిస్టీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని చైతన్య రావ్‌ అన్నారు. నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ, ‘ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ అందరినీ మెప్పిస్తుంది’ అని చెప్పారు. ‘దేవా ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా రూపొందించారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్‌ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్‌ మ్యూజిక్‌ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని మరో నిర్మాత విజరు కష్ణ లింగమనేని అన్నారు.
సోనీ లివ్‌ బిజినెస్‌ హెడ్‌ ధనీష్‌ కాంజీ, సోనీ లివ్‌ కంటెంట్‌ హెడ్‌ షోగత్‌ ముఖర్జీ ఈ వేడుకలో పాల్గొని ఈ సిరీస్‌లోని హైలెట్స్‌ గురించి తెలియజేసి, సిరీస్‌ విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -