Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రగతి స్కూల్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

ప్రగతి స్కూల్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు స్నేహితుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులు స్నేహం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే పాటలు పాడి అలరించారు. స్నేహం యొక్క ఔన్నత్యం గురించి స్నేహం గురించి విద్యార్థిని విద్యార్థులు ఉపన్యాసంలో వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ షబ్బీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలోని మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారని కుల,మత, జాతి భేదం లేకుండా అందరినీ ఒకటిగా కలిపి ఉంచేది స్నేహం మాత్రమేనని, జీవితంలో ఎంత ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకుంటే, అంత సంతోషంగా జీవించవచ్చని విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -