Wednesday, July 23, 2025
E-PAPER
Homeమానవిడిప్రెషన్‌ నుంచి ఇలా..

డిప్రెషన్‌ నుంచి ఇలా..

- Advertisement -

డిప్రెషన్‌.. ఇప్పుడు ఎవరిని కదిపినా ఇదే మాట వినిపిస్తోంది. కొంత మంది చిన్న చిన్న కారణాలకే డిప్రెషన్‌కు లోనవుతున్నారు. చివరికి అందులో నుంచి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య స్కూల్‌ కి వెళ్లే పిల్లలు సైతం డిప్రెషన్‌కు లోనై సూసైడ్‌ చేసుకుంటున్న టనలు చూస్తున్నాం. . డిప్రెషన్‌ అనేది పెద్ద సమస్య కాదు.. కానీ ఈజీగా తీసుకునేంత చిన్న సమస్య కూడా కాదు. స్కూల్‌ లో చదువుల ఒత్తిడులు, ఉద్యోగాల్లో టెన్షన్స్‌, ఆర్థిక ఇబ్బందులు, లైంగిక వేధింపులు, నచ్చిన వ్యక్తి మరణించడం ఇలా అనేక కారణాలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. అయితే వీటిని అధిగమించడం పెద్ద కష్టం కాదంటున్నారు నిపుణులు. మనకు నచ్చనివి జరిగినప్పుడు బాధ అనేది సహజం. కానీ కాస్త మైండ్‌ సెట్‌ ని మార్చుకుంటే అన్నీ ముందులా మామూలుగా ఉంటాయి. అలాగే మన లైఫ్‌ స్టైల్‌ లో, తీసుకునే ఆహార విషయంలో కొద్దిగా మార్పులు చేస్తే.. డిప్రెషన్‌ను దూరం పెట్టవచ్చు. అవేంటో చూద్దాం..

ఇబ్బందిని షేర్‌ చేసుకోవాలి : ఏ సమస్య వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో.. అది ఇతరులకు షేర్‌ చేసుకుంటే కాస్త బాధ తగ్గుతుంది. దీంతో మనసు తేలి క అవుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఇలా చెప్ప డం వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉంటాం.
మీకు నచ్చని వాటికి దూరంగా ఉండండి: కొంత మందికి కొన్ని ఇష్టం ఉండవు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు. మీకు నచ్చని వ్యక్తులైనా సరే వాళ్లకు దూరంగా ఉంటేనే బెటర్‌. కుదిరితే సున్నితంగా తిరస్కరించుకోవడం నేర్చుకోండి.
హెల్దీ డైట్‌ ప్లాన్‌ చేసుకోండి: మీ ఆరోగ్యం పట్ల మీరే శ్రద్ధ తీసుకోవాలి. మీకు నచ్చే వాటినే హెల్దీగా చేసుకుని తినండి. ఫ్రెష్‌ ఫ్రూట్స్‌, కూరగాయలను మీ డైట్‌ లో యాడ్‌ చేసుకోండి.
వ్యాయామం: వ్యాయామం కూడా మనసును రిలాక్స్‌ చేస్తుంది. కాబట్టి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించండి.
హాయిగా నిద్రపోండి: నిద్ర పోయేటప్పుడు మీకు నచ్చని వ్యక్తులు, విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. హాయిగా నిద్రపోడానికి ట్రై చేయండి. నిద్ర 22 శాతం డిప్రెషన్‌ ను దూరం చేస్తుందట.
మీకు నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడపండి:
డిప్రెషన్‌ లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తులతో టైమ్‌ స్పెండ్‌ చేస్తే.. డిప్రెషన్‌ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకూ యాక్టీవ్‌ గా ఉంటూ మీకు నచ్చిన వ్యక్తులతో టైమ్‌ స్పెండ్‌ చేయండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -