Friday, March 20, 2026
E-PAPER
Homeజాతీయంధర్మదామ్‌ నుంచి మూడోసారి

ధర్మదామ్‌ నుంచి మూడోసారి

- Advertisement -

కేరళ సీఎం పినరయి విజయన్‌ నామినేషన్‌ దాఖలు
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా రూ. కోటి ఆస్తులే…అప్పులు లేవని వెల్లడి

ధర్మదామ్‌ : ధర్మదామ్‌ అసెంబ్లీ స్థానం నుంచి కేరళ సీఎం, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత పినరయి విజయన్‌ మూడోసారి బరిలోకి దిగనున్నారు. ఆయన గతంలో కుథుపారంబ స్థానం నుంచి మూడుసార్లు, తలిపారంబ స్థానం నుంచి ఒకసారి పోటీ చేశారు. ధర్మదామ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వీపీ అబ్దుల్‌ రశీద్‌, బీజేపీ అభ్యర్ధిగా కే రంజిత్‌ బరిలోకి దిగారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీపీ అబ్దుల్‌ రశీద్‌ వ్యవహరిస్తున్నారు.

పదేండ్లు సీఎంగా ఉన్నా స్థిర, చరాస్తులు సుమారు రూ. కోటి రూపాయలే
కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత పినరయి విజయన్‌ తనకు రూ. కోటికిపైగా విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఆయన గురువారం ధర్మదామ్‌ అసెంబ్లీ స్థానంలో సమర్పించిన నామినేషన్‌ పేపర్లలో ఈ వివరాలను వెల్లడించారు. తనకు రూ.45 లక్షలకుపైగా విలువ చేసే చరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 80 గ్రాముల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, కంపెనీల షేర్లు ఉన్నాయని తెలిపారు. ఇక రూ.56 లక్షల విలువైన స్థిరాస్థులు ఉన్నాయని విజయన్‌ చెప్పారు.

ఇందులో ఒక ఇంటితో పాటు పథిరియాద్‌ అంసోమ్‌ గ్రామంలో 78 సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్నారు. తనకు, తన భార్యకు ఎలాంటి అప్పులూ లేవని ఆయన స్పష్టం చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.5.33 లక్షల ఆదాయం, తన భార్యకు రూ.5.77 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. 2016 నుంచి ఇప్పటివరకు, పదేండ్ల పాటు కేరళ సీఎంగా వ్యవహరించిన పినరయి విజయన్‌కు కేవలం రూ. కోటి ఆస్తులే ఉండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -