Sunday, February 1, 2026
E-PAPER
Homeహెల్త్'నా వల్ల కాదు' నుండి 'నేను ప్రయత్నిస్తాను' వరకు

‘నా వల్ల కాదు’ నుండి ‘నేను ప్రయత్నిస్తాను’ వరకు

- Advertisement -

కేస్‌ స్టడీ : ‘మహేష్‌ మనో స్థితి మారితే మేధస్సు ఎలా మారుతుంది?’
మహేష్‌ 8వ తరగతి చదువుతున్నాడు. చదువులో కాస్త తక్కువగా ఉండేవాడు. గణితం అంటే భయం, చదువంటే ఆసక్తి లేదు, ప్రశ్న అడిగితే… నాకు రాదు, నా వల్ల కాదు, నేను ఫెయిలవుతాను అనే మాటలే.
తల్లిదండ్రులు, టీచర్లు కూడా అనుకోకుండా ఇలా అనేవారు.. ‘నీవు చదవలేవు, నీ బుర్ర పని చేయదు’. దాంతో మహేష్‌ లోపల ఒక నెగెటివ్‌ మనో స్థితి ఏర్పడింది.

సమస్య ఏమిటి?
మహేష్‌ సమస్య తెలివి లోపం కాదు – మనోస్థితి లోపం. అతనిలో… ఆత్మవిశ్వాసం లేదు, భయం ఉంది, ప్రయత్నం చేసే మనసు లేదు. ఇది అతను Intrapersonal Intelligence (తన గురించి తాను అర్థం చేసుకునే తెలివి) బలహీనంగా ఉండటం వల్ల జరిగింది.
మార్పు ఎలా మొదలైంది?
నేను మహేష్‌తో ఇలా అన్నాను… ”నీకు తెలివి ఉంది. కానీ నీవు నీ మీద నమ్మకం పెట్టుకోవడం లేదు.”
నేను మూడు మార్పులు చేసాను..

1. మనో స్థితి శిక్షణ (AttitudeTraining)
రోజూ చదువు మొదలుపెట్టే ముందు మహేష్‌ ఇలా చెప్పాలి. ఈ సమస్య చేయగలను, నెమ్మదిగా అయినా నేర్చుకుంటాను. తప్పులు చేయడం తప్పు కాదు. నేను ప్రయత్నిస్తాను. – ఇది పాజిటివ్‌ సెల్ఫ్‌ టాక్‌.

2. Intrapersonal Intelligence పెంపకం
నేను మహేష్‌తో ఈ ప్రశ్నలు రాయించాను: ఏ సబ్జెక్ట్‌ అయినా కొంచెం ఇష్టమే? నేను ఎప్పుడూ ఆనందంగా నేర్చుకుంటాను? నా బలాలు ఏమిటి?
వీటికి మహేష్‌ సమాధానాలు తెలుసుకున్నాడు:
డ్రాయింగ్‌, కథలు ఇష్టం. అంటే నేను పూర్తిగా మూర్ఖుడిని కాదు.



3. సరైన వాతావరణం (Positive Environment)
తప్పు చేస్తే తిట్టడం లేదు,ప్రయత్నం చేస్తే మెచ్చుకోవడం.
సమాధానం కన్నా ప్రయత్నం ముఖ్యం అని చెప్పడం భయం తగ్గింది
– ఆసక్తి పెరిగింది ఫలితం (ఉబ్‌షశీఎవ)

3 నెలల తర్వాత:
గణితంలో మార్కులు పెరిగాయి. ముఖ్యంగా భయం తగ్గింది. ”నాకు రాదు” అన్న మాట ‘ప్రయత్నిస్తాను’గా మారింది.
– మహేష్‌ తెలివి మారలేదు, అతని మనో స్థితి మారింది. అదే అతని నేర్చుకునే శక్తిని మార్చింది.
ఈ కేస్‌ స్టడీ మనకు ఏం చెబుతుంది?
పిల్లల వైఫల్యం ఎక్కువసార్లు బుద్ధి లోపం వల్ల కాదు, నెగెటివ్‌ మనోస్థితి వల్ల.

పాజిటివ్‌ డిస్పోజిషన్‌ ఉంటే:
మెదడు రిలాక్స్‌ అవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నేర్చుకోవడం ఆనందంగా మారుతుంది.
‘నీ వల్ల కాదు’ అనే మాట.. జీవితాన్ని పాడుచేస్తుంది. ‘ప్రయత్నించు’ అనే మాట. జీవితాన్ని మార్చుతుంది
తెలివైన వ్యక్తుల మనోస్థితి
మనిషికి తెలివి ఎంత ఉన్నా, ఆ తెలివిని ఉపయోగించే మనోస్థితి లేకపోతే అది పూర్తిగా బయటపడదు. అందుకే తెలివైన వ్యక్తులను ప్రత్యేకంగా నిలబెట్టేది వారి మనోస్థితి.
జీవితంలో ఈ ప్రశ్నలు చాలా కీలకం.
ఆలోచించడం, నేర్చుకోవడం పట్ల దక్పథాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే తెలివి ఏది? మనం చేయాల్సిన శారీరక లేదా మానసిక పనిని ఆనందంగా, పాజిటివ్‌గా చేయడానికి మనకు అసలు ఏం సహాయపడుతుంది?
క్రీడా జట్లు, క్రీడాకారులు పాజిటివ్‌ మనోస్థితి ఎలా పెంచుకుంటారు? అదే విధంగా మన మనో స్థితిని శిక్షణతో మార్చుకోగలమా?
నేర్చుకునే ప్రక్రియలో పాజిటివ్‌ దక్పథం ఎందుకు అంత ముఖ్యమైనది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే నేర్చుకోవడం మనకు భారంగా కాకుండా ఆనందంగా మారుతుంది.

మనోస్థితి, బహుళ మేధస్సులు
ఒక వ్యక్తి ఏదైనా తెలివిని నిజంగా అభివద్ధి చేయాలంటే, ఆ తెలివిని ఉపయోగించే పనుల పట్ల సరైన మనోస్థితి ఉండాలి.
సృజనాత్మక ఆలోచన (Creative Thinking)
మీరు కొత్త ఆలోచనలు చేయాలంటే:
– రిస్క్‌ తీసుకునే ధైర్యం ఉండాలి
– కల్పన చేసే అలవాటు ఉండాలి
– తప్పులు చేయడాన్ని భయపడకూడదు
విమర్శాత్మక ఆలోచన (Critical Thinking)
మీరు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటే.. స్పష్టత, ఓపెన్‌ మైండ్‌, నిష్పాక్షికత, అవసరమైతే అభిప్రాయం మార్చుకునే సంసిద్ధత లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి.
మనో స్థితిని ఎక్కువగా ప్రభావితం చేసే తెలివి: భావాలు, ఆలోచనలు, బలాలు, బలహీనతలను అర్థం చేసుకునే తెలివి.
ఈ తెలివి బలంగా ఉన్నవారు..
తమను తాము అర్థం చేసుకుంటారు. తమ పరిమితులను అంగీకరిస్తారు. తమ బలాలను ఉపయోగించుకుంటారు.
ఈ తెలివిని పెంచే ప్రశ్నలు:
నాకు ఏం ఇష్టం?
ఏం ఇష్టం లేదు?
నా లక్ష్యాలు ఏమిటి?
నేను దేనిలో బాగున్నాను?
దేనిలో బలహీనుడిని?
చదువు, పని, జీవితం పట్ల నా దక్పథం ఏంటి?
ఇలా మనం మన గురించి మనమే ఆలోచిస్తే, మనకు నేర్చుకోవడంలో ఆటంకం కలిగించే, నెగెటివ్‌ భావాలు స్పష్టంగా తెలుస్తాయి.
పాజిటివ్‌ మనోస్థితి ఎందుకు అవసరం?
మనం వింటున్నది, చూస్తున్నది ఎంత బాగా అర్థం చేసుకుంటామో నిర్ణయిస్తుంది.
మన ఉత్సాహం, ప్రయత్నం మీద ప్రభావం చూపిస్తుంది. మెదడులో జ్ఞాపకశక్తికి అవసరమైన రసాయనాల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వేర్వేరు పనులకు, వేర్వేరు ‘ఫ్రేమ్‌ ఆఫ్‌ మైండ్‌’ అవసరం.
మెదడుకు మంచి ఆహారం ఇస్తే రిలాక్స్‌ చేస్తే, వ్యాయామం చేస్తే అది మరింత సమర్థంగా పనిచేస్తుంది.
మనోస్థితి శిక్షణ (Attitude Training)
పాజిటివ్‌ మనోస్థితి శిక్షణ వల్ల చదువులో వెనుకబడిన వారు, సమస్యలు పరిష్కరించలేని వారు కూడా మెరుగుపడతారు. దష్టి, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంచుకుంటారు.
సమస్యకు పరిష్కారం ఎలా ఆలోచించాలి:
‘ఈ సమస్యను పరిష్కారించగలను’
‘సమాధానం దొరికే వరకు ప్రయత్నిస్తాను’
‘నా వంతు శ్రద్ధగా కషి చేస్తాను’
‘ఈ పని నాకు ఇష్టం’
‘ఎప్పుడైనా రాకపోతే తర్వాత తప్పకుండా వస్తుంది’..
‘జాగ్రత్తగా చేస్తాను’
ఇలాంటి మాటలను ముందే రాసుకుని
పని మొదలుపెట్టే ముందు, చేస్తున్నప్పుడు చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సజనాత్మక ఆలోచనకు కావలసిన మనోస్థితి:
రిస్క్‌ తీసుకుంటారు.
కల్పన చేస్తారు
ఆలోచనలతో ఆటలాడతారు.
రూల్స్‌కి భిన్నంగా ఆలోచిస్తారు.
ఆసక్తి, హాస్యం కలిగి ఉంటారు
టీచర్లు, తల్లిదండ్రులు, మేనేజర్లు
ఇలాంటి వాతావరణాన్ని సష్టించాలి.
విమర్శాత్మక ఆలోచన – COOL పద్ధతి
మంచి విమర్శాత్మక ఆలోచకుడు:
C — Clear
విషయం ఏంటో స్పష్టంగా తెలుసుకుంటాడు
O — Open-minded
ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు.
O — Objective
ఆధారాలు చూసాకే నిర్ణయం తీసుకుంటారు.
ూ — ూశీశీరవ / ఖీశ్రీవఞఱbశ్రీవ
కొత్త సమాచారం వస్తే అభిప్రాయం మార్చుకుంటాడు

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -