దేశవాళీ రెడ్‌బాల్ ఫార్మాట్‌లో అమలు
2025-26 రూల్స్ మార్పు చేసిన బీసీసీఐ
ముంబయి : ఇటీవల ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో తీవ్రంగా గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునే నిబంధన ఉండాలనే చర్చ ఎక్కువగా జరిగింది. లార్డ్స్ టెస్టులో రిషబ్ పంత్ పాదం గాయంతోనే బ్యాటింగ్ చేయగా.. ఓవల్ టెస్టులో భుజం గాయంతో క్రిస్ వోక్స్ బ్యాట్ పట్టాల్సి వచ్చింది. తీవ్ర గాయాలతో ఆటగాళ్లు ఆడలేని పరిస్థితుల్లో అటువంటి ఆటగాడినే మరొకరిని ఎంచుకునే వెసులుబాటు బీసీసీఐ కల్పించింది. ఇటీవల జరిగిన మ్యాచ్ అధికారుల (అంపైర్లు, రిఫరీలు) సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు తెలిపింది. సీనియర్, జూనియర్ స్థాయిలో మల్టీ డే క్రికెట్ (రెడ్‌బాల్)లోనే ఈ రూల్ అమలు వర్తించనుంది. వైట్‌బాల్ ఫార్మాట్ (విజరు హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ)లో ఈ రూల్ అమలు చేయరు. ఆటగాడు గాయపడిన అంశంలో అంపైర్‌దే తుది నిర్ణయం కానుంది. అంపైర్ అవసరమైతే రిఫరీ, వైద్యుడి సలహా తీసుకోవచ్చు. ఇంజూరీ రిప్లేస్‌మెంట్ కోసం జట్టు మేనేజర్ మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ తరహాలోనే ఇంజూరీ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు తుది జట్టులో ఆడతాడు.
ఇక నుంచి ఇంజూరీ సబ్‌స్టిట్యూట్!
- Advertisement -
- Advertisement -