కొంగల వెంకట్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ – కామారెడ్డి
నవతెలంగాణ విలేకరులకు, ఉద్యోగులకు, అందులో వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తిగా కొనసాగి, తెలంగాణ ఏర్పడిన అనంతరం నవతెలంగాణతో తన ప్రత్యేకతను చాటుకుంటూ .. పేదలకు ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావిస్తూ .. వారి పక్షాన వార్తలు, కథనాలను ప్రచురిస్తున్న నవతెలంగాణ. కార్పొరేట్లకు వంత పాడే నేటి సమాజంలో, ఉద్యోగుల కార్మికుల పక్షాన పోరాడుతూ.. తన ప్రత్యేకతను చాటుకుంటూ.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కొనసాగుతోంది నవతెలంగాణ. నేటికీ ప్రస్తుతమున్న పత్రికల్లో పేదల, కార్మికుల, ఉద్యోగుల అవస్థల గురించి తెలుసుకోవాలంటే నవతెలంగాణ పత్రిక చదవవలసిందే. అలాంటి పత్రికకు పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
నాటి నుంచి నేటి వరకు పేదల, కార్మికుల పక్షాన నవతెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES