Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్డ్స్ బాలబాట ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

కార్డ్స్ బాలబాట ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణంలోని సిఎస్ఐ ఆశ్రమ పాఠశాలలో బాలబాట వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పి.రంజన్ బాబు పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమ పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానుద్దేశించి కార్డ్స్ బాలబాట ములుగు జిల్లా ఆర్ సిఓ సీపతి రాజు మాట్లాడుతూ.. దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంజన్ బాబు అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించడం జరిగిందని తెలిపారు. కార్డ్స్ బాలబాట డైరెక్టర్ ఫ్రాంక్ విశ్వనాధ్, మేరీ, తెలంగాణ డైరెక్టర్ రజిని , డిడి దివ్య, ములుగు ఏజెన్సీ ప్రాంతంలో అవకాశం కల్పించినందుకు ప్రేమతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోకార్స్ బాలబాట సభ్యులు ఏకు హరి, సాధు దిలీప్, ఏకు అశోక్, అరవింద్, రేవంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -