– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
– తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
నవతెలంగాణ- కనగల్
పేదల సొంతింటి కలను నెరవేర్చుతానని రోడ్డు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో 107 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తవ్వగా.. శనివారం లబ్దిదారులతో కలిసి మంత్రి గహప్రవేశం ప్రారంభించారు. 51మంది లబ్దిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ.. తాము అధికారంలోకొచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం అందజేశామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చి ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామన్నారు. నూతన గ్రామ పంచాయతీలకు రేషన్ షాప్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్వేశిపురం, చర్లగౌరారం, తేలకంటిగూడెం గ్రామాలు కలుపుతూ డాంబర్ రోడ్డుకు రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఎల్‌ఈడిలైట్లు, సీసీ రోడ్లు మంజూరు చేసినందుకు మాజీ సర్పంచ్ బోగారి రాంబాబు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజకుమార్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీవో సుమలత, ఆర్టీఏ మెంబర్ రాజీరెడ్డ్డి, మాజీ జెడ్పీటీసీి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, గడ్డం అనూప్ రెడ్డి, జగాల్‌రెడ్డి, పల్లెబోయిన బిక్షం యాదవ్, బీర్లపాటి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.