Saturday, March 21, 2026
E-PAPER
Homeకరీంనగర్పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తా: జీవన్‌రెడ్డి

పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తా: జీవన్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: పార్టీ మారతానన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆయనతో మంత్రులు శ్రీపాద శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్యే సత్యం భేటీ అయ్యారు. గంటకుపైగా సమావేశమయ్యారు. పార్టీలో గౌరవం దక్కడం లేదని ఈ సందర్భంగా మంత్రుల ముందు జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని అన్నారు. ఆయనతో అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఆయన ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -