- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 18వ తేదీన రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం వారు పిలుపునిచ్చిన బంద్ ఫర్ జస్టిస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ బీసీ సంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలుపాలని వినతి పత్రం అందించగా ఆయన మాట్లాడారు.బీసీలు కష్టపడే కులాలని వారికి న్యాయమైన వాట దక్కాలని అన్నారు. బీసీలు అంటే తనకు ఎనలేని గౌరవమని వారి కొరకు తాను ముందు వరుసలో ఉండి వారికి న్యాయం చేసే విధంగా చూస్తారని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బసవసాయి చంద్రకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -