– గిరిజన సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి బీమా సాహెబ్
నవతెలంగాణ – కరీంనగర్
ఈ నెల 23న విద్యాసంస్థల బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడా మోహన్ నాయక్, భీమా సాహెబ్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్, కార్పొరేట్ స్కూల్ ల యాజమాన్యాలు విచ్చలవిడిగా విద్యాసంస్థలు నెలకొల్పి విద్యావ్యవస్థను ఒక వ్యాపార దృక్పథంతో నడిపిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రతి ప్రవేట్ స్కూలు ప్రభుత్వం నుండి నిబంధనకు లోబడి అనుమతులు తీసుకొని విద్యార్థులకు విద్యను ఇవ్వాల్సిన ప్రవేట్ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వారే స్వయంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ లో టైలు బెల్టులు షూస్ లు అన్ని వారే తయారు చేసుకుని ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక రేట్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడి చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రతి ప్రవేట్ పాఠశాలకు అనుసంధానంగా హాస్టల్లు నెలకొల్పి లక్షలలో ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యం వసూలు చేస్తున్నా కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం విద్య వ్యవస్థ పై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారులు ప్రైవేట్ స్కూల్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా అమ్మమ్యాలకు అలపాటపడి శాఖ పరమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని వారు అన్నారు. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు అనుమతి లేని అర్హత లేని నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి నిజరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సంఘాల ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.