Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంస్టార్టప్‌లకు నిధుల కటకట

స్టార్టప్‌లకు నిధుల కటకట

- Advertisement -

ఫండ్స్‌ సమీకరణలో సవాళ్లు
ఈ ఏడాదిలో 25 శాతం పతనం

బెంగళూరు : భారత్‌లోని స్టార్టప్‌ సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. నిధుల సమీకరణలో తీవ్ర సవాళ్లను చవి చూస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయ టెక్‌ వెంచర్లలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులకు ఆసక్తిని చూపిన ఇన్వెస్టర్లు ఇటీవల నెమ్మదించారు. దీంతో నిధుల కొరతతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు నిరాశ చెందుతున్నారని తాజా రిపోర్టులు వెల్లడిస్తోన్నాయి. పెట్టుబడులు, స్టార్టప్‌ల తీరుపై విశ్లేషణలు చేసే ట్రాక్సన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఈ ఏడాది 2025లో జనవరి 1 నుంచి జూన్‌ మధ్య కాలంలో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు 25 శాతం పతనమై 4.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 6.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 2024 జులై నుంచి డిసెంబర్‌ కాలంలో 5.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి.

కాగా.. గడిచిన జనవరి నుంచి జూన్‌ ప్రథమార్థంలో అమెరిక స్టార్టప్‌లకు అత్యధికంగా రూ. 125 కోట్లు , బ్రిటన్‌ సంస్థలకు సుమారు రూ. ఎనిమిది కోట్ల మేర నిధులు సమకూరాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌ పెట్టుబడుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో బెంగళూరులోని స్టార్టప్‌లకు అత్యధికంగా 26 శాతం నిధులు అందగా.. ఢిల్లీ సంస్థలకు 25 శాతం నిధులు పొందాయి. దేశ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న బలహీనతలు, డిమాండ్‌లో తగ్గుదల స్టార్టప్‌ నిధులకు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ”గత సంవత్సరాల్లో పెట్టుబడిదారుల్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కానరావడం లేదు. పెట్టుబడులపై చాలా అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వల్ల నెలకొన్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడుతు న్నారు.” అని ట్రాక్సన్‌ సహ వ్యవస్థాపకురాలు నేహా సింగ్‌ పేర్కొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -