యూనివర్సిటీలకు ట్రంప్ వార్నింగ్
భారతీయ విద్యార్థులే లక్ష్యంగా ఆదేశాలు
వాషింగ్టన్ : తాను విధించిన సుంకాలు భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కంగుతిన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. వారిపై నేరుగా ప్రభావం చూపేలా విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. షరతులు పాటిస్తేనే ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయని, లేకుంటే వాటిని నిలిపివేస్తామని తొమ్మిది యూనివర్సిటీలకు మెమోలు పంపారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పదిహేను శాతానికి పరిమితం చేయాలని, ఏ ఒక్క దేశం నుంచి ఐదు శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండకూడదని, విదేశీ విద్యార్థుల ప్రవేశాలను తగ్గించుకోవాలని ట్రంప్ తన తాజా ఆదేశాలలో స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులకు సవా లుగా మార బోతోంది. ప్రవేశాలు, వీసాలు
పొందడానికి వారు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాగా తొమ్మిది విశ్వవిద్యాలయాలకే మెమోలు ఎందుకు పంపారన్న విషయంపై అధ్యక్ష భవనం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అధిక సుంకాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సుంకాల విధింపుతో పాటు హెచ్-1బీ వీసా ఫీజులను కూడా ట్రంప్ భారీగా పెంచేశారు. ఇప్పుడు జారీ చేసిన మెమోల కారణంగా భారతీయ విద్యార్థులు అనేక సవాళుఎదుర్కోవాల్సి వస్తుంది.మొత్తం విద్యార్థుల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఐదు శాతానికి మించ కూడదన్న నిబంధన వారి పాలిట అశనిపాతమ వుతుంది. ఈ నిబం ధన కారణంగా ఎంచుకున్న
వర్సిటీలలో సీటు
పొందే అవకాశం ఉండదు.
నిధులు కట్ షరతులు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES