రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు.
భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాటారం నుండి మేడారం రోడ్డు మహాదేవపూర్,ముకునూరు,కనుకునూరు నుండి కాటారం రోడ్డు 15 కిలోమీటర్లకు రూ.12 కోట్లు, శంకరంపల్లి నుండి రుద్రారం వరకు మూడు కిలోమీటర్లు 8 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ నుండి నిధులు మంజూరైనట్లుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు మంథని నియోజకవర్గంలోని కాటారం మండలంలో కాటారం యామాన్ పల్లి వరకు ,ముకునూరు, కనుకునూరు మేడారం రోడ్డు వరకు15 కిలోమీటర్లు మనమత్తులు బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల కోసం రూ.12 కోట్ల నిధులను శంకరంపల్లి నుండి రుద్రారం వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును రూ.8 కోట్లతో ఈరోజు మంజూరు కావడం జరిగిందన్నారు.మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కాకుండా కాటారం మీదుగా మేడారం జాతర వెళ్ళడానికి రోడ్డు సమస్య రాకుండా, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా రోడ్డును వెంటనే మంజూరు చేసినట్లుగా తెలిపారు.ఇందుకు మంత్రికి కాటారం,మహాదేవపూర్,మల్హర్,మహాముత్తారం మండలాల ప్రజలు ప్రజా ప్రతినిధులు,నాయకులు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిధులు మంజూరు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



