నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి పట్టణాభివృద్ధిలో భాగంగా సుందరీ కరణ పనుల నిమిత్తం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 18.70 కోట్ల నిధులను విడుదల చేసింది. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి మునిసిపాలిటీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో రూ. 18 కోట్ల 70 లక్షలను మంజూరు చేసినట్లు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. యు ఐ డి ఎఫ్ నుంచి మంజూరైన ఈ నిధుల నుంచి వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహకు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు, వాకిటి శ్రీహరికి, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తి మునిసిపాలిటీకి రూ.18.70 కోట్ల నిధులు మంజురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



