Saturday, January 17, 2026
E-PAPER
Homeకరీంనగర్పాత బస్టాండ్ మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు

పాత బస్టాండ్ మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు

- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వర్షాలతో ముంపుకు గురయ్యే వార్డులకు శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల 70 లక్షల నిధులు విడుదల చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా అభివృద్ధి పేరిట అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకుండా చేసినట్లు ప్రజలను బి ఆర్ ఎస్ మోసం చేసిందని అన్నారు. చిన్నపాటి వర్షం పడితే సిరిసిల్ల పాత బస్టాండ్ నుండి మొదలుకొని శాంతినగర్ శ్రీనగర్ కాలనీ జలమయమై నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తానే స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు.

అలాంటి ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. డ్రైనేజీ నిర్మాణం తో పాటు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త బస్టాండ్ నుండి అంబ భవాని దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం అలాగే రగుడు మల్లన్న దేవాలయం వరకు సిసి రోడ్డు వీటన్నిటి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. టెండర్లు కూడా పూర్తి కావస్తున్నాయని రానున్న రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని కేకే తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, చేనేత సెల్ అధ్యక్షుడు  గోనె ఎల్లప్ప, అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, కుడిక్యాల రవి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -