Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు..

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు..

- Advertisement -

విద్యుత్, వాటర్ సప్లై పనులకు ప్రాధాన్యత.. 
నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలలో కనీస వసతులు సౌకర్యాలు లేక విద్యార్థులు, లెక్చరర్లు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఏ ఏ కళాశాలలో ఏ ఏ వసతులు సౌకర్యాలు కావాలని అధికారులు గుర్తించి ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వ కళాశాలల మరమ్మతుల కోసం కళాశాల వారి ప్రభుత్వం నిధులు మంజూరు. ఎన్నో ఏళ్ల క్రితం కళాశాలలకు రంగులు వేశారు. కొన్ని కళాశాలలో ఎలక్ట్రిషన్ సమస్య ఉంది. మరి కొన్ని కళాశాలలో త్రాగినీటి సమస్య ఉంది. కొన్ని కొన్ని కళాశాలలో కాంపౌండ్ గోడలు కొన్ని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి.

 ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కళాశాలలో వసతులు, సౌకర్యాలు కల్పించనున్నారు. మరమ్మత్తుల పనులు పూర్తయ్యాక అన్ని కళాశాలలకు తెలుపు రంగు వేయాలని, పైన అంచు నీలం రంగు వేయాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ శాఖ ఉన్నత అధికారులు సూచించినట్లు తెలిసింది.

 కల్వకుర్తి జూనియర్ కళాశాలకు రూ.9 లక్షల 40.వేలు,  తిమ్మాజీపేటకు రూ.9 లక్షల 50 వేలు,  కొల్లాపూర్ జూనియర్ బాలుర కళాశాలకు రూ.9 లక్షల31వేలు, కొల్లాపూర్ బాలికల కళాశాలకు రూ.9 లక్షలు, కోడేరు కళాశాలకు రూ.8 లక్షల 95 వేలు, అచ్చంపేట బాలికల కళాశాలకు రూ. 2 లక్షల 55వేలు, బిజినపల్లి మండలం పాలెం జూనియర్ కళాశాలకు రూ.7 లక్షలు, నాగర్ కర్నూల్ బాలికల కళాశాలకు రూ.9 లక్షల 40 వేలు, నాగర్ కర్నూల్ బాలుర కళాశాలకు రూ.10 లక్షలు, తాడూరు జూనియర్ కళాశాలకు రూ.9,40,000, వెల్దండ జూనియర్ కళాశాలకు రూ.9,80,000, అమ్రాబాద్ జూనియర్ కళాశాలకు రూ.4 లక్షల10.వేలు, బల్మూర్ జూనియర్ కళాశాలకు రూ.916000, వంగూరు కళాశాలకు రూ. 15 లక్షలు. జిల్లాలోని మొత్తం 14 కళాశాలలకు రూ.

రూ.1 కోటి 22 లక్షల 50 వేలు మంజూరు: విద్యుత్, వాటర్ సప్లై పనులకు ప్రాధాన్యత, వెంకటరమణ జిల్లా ఇంటర్మీడియట్ మోడల్ అధికారి
జిల్లాలో 14 కళాశాలలకు మరమ్మత కోసం గతంలో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రతిపాదనలు సమర్థిస్తూ కళాశాల వారిగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అన్ని కళాశాలలో ప్రధానంగా విద్యుత్ పనులు మరమ్మత్తులు, వాటర్ సప్లై పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ సూచనల విధంగానే నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -