– పాఠశాలను తనిఖీ చేసిన టీజీ ఈడబ్ల్యు ఐడీ సీ ఏఈ రాంకుమార్
– పనులు ప్రారంభించాల్సి ఉందిగా ఇంచార్జి హెచ్ ఎం వరలక్ష్మి కి ఆదేశం
– నవతెలంగాణ కధనానికి స్పందన
నవతెలంగాణ – అశ్వారావుపేట
దళిత కాలనీ పాఠశాల అభివృద్ది అసంపూర్తి శీర్షికన నవతెలంగాణ లో మంగళవారం ప్రచురితం అయిన కధ నానికి స్పందన లభించింది. టీజీ ఈడబ్ల్యు ఐడీ సీ( తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ )ఏఈ రాంకుమార్ పాఠశాలను సందర్శించి తక్షణమే ఏ పనులు చేపట్టాలో ఇంచార్జి హెచ్ ఎం మెట్ట వరలక్ష్మి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ప్రాధమిక అవసరాలు ఏమిటో గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని,ఇందుకోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,విద్యాశాఖ జిల్లా అధికారి రూ.2 లక్షలు కేటాయించారని ఆమెకు తెలిపారు.
వాస్తవానికి వర్షపు నీటితో మునిగిన పాఠశాల ప్రాంగణం దృశ్యాలను నవతెలంగాణ సోమవారమే చిత్రీకరించి,వివరణ కోరిన వెంటనే ఎంఈఓ ప్రసాదరావు,కమీషనర్ నాగరాజులు స్పందించి నీటిని తరలించే చర్యలు చేపట్టారు. దీంతో నవతెలంగాణ కధనానికి స్పందన లభించడంతో పాటు,అభివృద్ధికి నిధులు కేటాయించడం,ఏఈ రాంకుమార్ సందర్శించడం తో పాఠశాల సిబ్బంది,కాలనీ వాసులు పత్రికకు అభినందనలు తెలిపారు.