Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ట్రైబల్ కనెక్టివేటీ రోడ్లకు నిధులు మంజూరు..

ట్రైబల్ కనెక్టివేటీ రోడ్లకు నిధులు మంజూరు..

- Advertisement -

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని నియోజకవర్గం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన గిరిజన గ్రామాల అనుసంధానం (ట్రైబల్ కనెక్టివిటీకి) రోడ్లకు సంబంధించి మహాముత్తారం, కాటారం మండలాలలో మూడు బిటి రోడ్ల పనులకు రూ.10 కోట్ల 66 లక్షల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు అయినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రెండు మండలాలైన కాటారం, మహాముత్తారం కు సంబంధించిన నిధులు మంజూరైన  మూడు బిటి రోడ్డు పనుల వివరాలను తెలిపారు. 

కాటారం మండలంలో రూ. 4 కోట్ల 45 లక్షలు 30వేలు ప్రతిపాదిత వ్యయంతో 4.20 కిలోమీటర్ల దేవరంపల్లి టు ఎడ్లపల్లి బీటీ రోడ్డు, మహాముత్తారం మండలం ఎర్రం టు నర్సింగాపూర్ ఎక్స్ రోడ్ వయా మీనాజీపేట రెండు కిలోమీటర్లు బిటి రోడ్ కు రూ. కోటి 96 లక్షల 52వేలు, మహాముత్తారం మండలం  ప్రేమ్ నగర్ టు నందిగామ 4.80 కిలోమీటర్ల రోడ్డుకు రూ.4 కోట్ల 24 లక్షల 90 వేలు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మహాముత్తారం, కాటారం మండలల ప్రజలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad