నవతెలంగాణ – బాల్కొండ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎంపీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ ల్యాండ్స్ 2025-26 నుంచి పలు అభివృద్ధి పనులకు 5.25 లక్షల రూపాయలు మంజూరు చేశారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి తెలిపారు. కిసాన్ నగర్ గ్రామంలోని ఈద్గా వద్ద ప్రహరీగోడ నిర్మాణం కోసం 4లక్షలు, బోర్ కోసం 1.25 లక్షలు మంజూరు చేశారని అన్నారు. కిసాన్ నగర్ గ్రామం తరుపున మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, శరత్, బిఆర్ఎస్ నాయకులు షేక్ .రహిముద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



