Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'ఫంకీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఫంకీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. టీజర్‌తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వినోదభరిత చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తే అద్భుతమైన బృందం ఒకచోట చేరింది. దర్శకుడు కె.వి.అనుదీప్‌ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు.

ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే విశ్వక్‌ సేన్‌ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్‌, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. నాయిక కయాదు లోహర్‌ టీజర్‌లో తన అందంతో కట్టిపడేశారు. తెరపై విశ్వక్‌-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. యువత మనసు దోచుకుంటోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -