హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి.అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలు కానుంది. ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తొలుత ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.
నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదాల కలయికలో ఈ సినిమా రూపొందుతోంది.
దర్శకుడు కె.వి.అనుదీప్ ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కథానాయిక కయాదు లోహర్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



