Thursday, May 15, 2025
Homeఎడిట్ పేజితమాషా దేఖోరే

తమాషా దేఖోరే

- Advertisement -

బొమ్మలాటరో
తుపాకుల మోత
బొమ్మలాటరో
చంపేవానికి చచ్చేవాడు
లోకువరో
బాధగా చస్తుంటే
వానికి యమాకుషీరో
బొమ్మలాటరో
తూటాలంగడి
బొమ్మలాటరో
చంపేవానికి చచ్చేవానికి
ఉద్దరిచ్చి మరీ అమ్ముతాడ్రో
ఇద్దరూ చంపుకు చస్తుంటే
వానికి భలే కుషీరో
ఫాయిదా కుషీరో
ఆయుధాలు
అమ్మడం కొనడం
చంపడం చావడం
దిల్‌లేని దిమాక్‌ తమాషారో
సొంచాయించి జర దేఖోరే
పూరాజిందగీ ఖరాబ్‌చేసే
గీ తైతక్కలాటలో
ఇన్సాఫ్‌ తెలుసుకో
ఇన్సాన్‌గా మెసులుకో
పోయినోళ్లు ఈ ఆటలో
ఎప్పటికీ తిరిగి రారురో
సోయిన్నుళ్లే జారే కన్నీళ్లకు
జిమేదారిరో
డబ్బా కొట్టుకునే నేతలకు
కర్రుకాల్చి వాతపెట్టరో
ఈ ఖేల్‌ ఖతం
దుకాణం బంద్‌కు
ఇక నువ్వే
ముందడుగు వేయాల్రో…
– కె.శాంతారావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -