Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంఅత్యవసర చమురు నిల్వలపై జీ7 దేశాల చర్చలు

అత్యవసర చమురు నిల్వలపై జీ7 దేశాల చర్చలు

- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) సహకారంతో తమ వద్ద ఉన్న అత్యవసర చమురు నిల్వలు విడుదల చేయడంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని వార్త సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి.
ఈ ఆలోచనకు అమెరికాతో సహా మూడు జీ7దేశాలు ఇప్పటికే ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అలాగే, ఇరాన్‌ యుద్ధం ప్రభావం చర్చించడానికి మంత్రులు, ఐఈఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పతిహ బిరోల్‌ కూడా ఒక పిలుపు ఇవ్వనున్నట్టు తెలిపాయి. సోమవారం నాటికి ఆయిల్‌ ధరలు 25 శాతం పెరిగిన నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు ఉధృతం అవుతున్న కారణంగా కొన్ని ప్రధాన ఆయిల్‌ ఉత్పత్తి దేశాలు తమ సరఫరాను తగ్గించడం, షిప్పింగ్‌ను నిలిపివేయడం వంటి అంశాలు తరువాత కూడా జీ7 దేశాల సమావేశాం గురించి వార్తలు రావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -