- Advertisement -
పలువురు అభినందనలు
నవతెలంగాణ – మల్హర్ రావు: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలోని గాదంపల్లికి చెందిన నల్లాల రమాదేవి-వెంకటేష్ దంపతులు కుమారుడు నల్లాల మనిదీప్ రాష్ట్ర స్థాయి 200 ర్యాంక్ సాధించాడు. భవిష్యత్ లో సివిల్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టుగా తెలిపాడు. మనిదీప్ కు రాష్ట్ర స్థాయి ర్యాంక్ రావడంపై తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మండల తాజా మాజీ మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ సర్పంచ్ విజయ-నాగేశ్వరరావు తోపాటు పలువురు అభినందించారు.
- Advertisement -