Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగడాఫీ కుమారుడి దారుణ హత్య

గడాఫీ కుమారుడి దారుణ హత్య

- Advertisement -

నేరుగా ఇంట్లోకి చొరబడి కాల్పులు

జింటాన్‌ : లిబియా నియంత ముమ్మార్‌ గడాఫీ కుమారుడు సయీఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీని (56) దారుణ హత్యకు గురయ్యారు. జింటాన్‌ నగరంలోని ఆయన ఇంట్లోకి చొరబడి గడాఫీని సాయుధ దుండగులు హత్య చేసినట్టు లిబియన్‌ భద్రత అధికారులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. సయిఫ్‌ మరణాన్ని ఆయన రాజకీయ సలహదారు అబ్దుల్లా ఉస్మాన్‌ అబ్దు రహీం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ ఘటన ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకుని జింటాన్‌ నగరంలోని సయిఫ్‌ ఇంట్లోకి చొరబడినట్టు తెలిపారు. వెంటనే ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, ఆ తర్వాత తుపాకులతో ఆయనను కాల్చి చంపినట్టు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. తన భద్రత గురించి సయిఫ్‌ తన స్నేహితుడి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే గడాఫీ తెగకు చెందిన పెద్దలు ఆయనకు అదనపు భద్రతను పంపిస్తామని ప్రతిపాదించినప్పటికీ, సయిఫ్‌ దానిని తిరస్కరించినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -