Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కు వినియోగించుకున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

- Advertisement -

 నవతెలంగాణ –  కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ పోలింగ్ బూత్ నెం.111లో బుధవారం ఉదయం 11:20 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రజాస్వామ్యాన్ని బలపర్చే ఈ పవిత్ర హక్కును ప్రతి ఓటరు బాధ్యతగా భావించి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలు, ఘర్షణలు లేకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -