- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏఐకేఎస్ – తెలంగాణ రైతుసంఘం అశ్వారావుపేట మండలాధ్యక్షుడుగా గడ్డం సత్యనారాయణ తిరిగి ఎన్నికయ్యారు. శుక్రవారం మండలంలోని వినాయక పురంలో జరిగిన ఈ సంఘం రెండో మహాసభలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా పండువారిగూడెం సీసం రాము, కోశాధికారి గా అచ్యుతాపురం సంతపురి చెన్నారావు, సహాయ కార్యదర్శులుగా గడ్డం వెంకటేశ్వరరావు, మడకం శాంతి మరో పదిమంది తో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.
- Advertisement -

 
                                    