నవతెలంగాణ – భైంసా
భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు శనివారం గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఐదు గేట్ల ఎత్తివేసి 20000 క్యూసెక్కుల నీటిని సుద్ద వాగులోకి వదిలారు. అవుట్ ఫ్లో 12000 క్యూసెక్కుల నీరు రావడంతో ప్రాజెక్టు ఐదు గేట్లను కొద్ధిమేర ఎత్తివేశారు. ఐదు గేట్లను ఎత్తివేయడంతో బైంసా పట్టణానికి వెళ్లే బైపాస్ రహదారి బ్రిడ్జి నీట మునగడంతో ఆ వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రాజెక్టు వద్ద, బైపాస్ బ్రి డ్జ్ వద్ద పోలీస్ యంత్రాంగం అప్రమత్తమవుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో సందర్శకుల తాకిడి ఆగిపడింది. గేట్ల నీటి ప్రవాహాన్ని చూడడానికి పెద్ద మొత్తంలో జనంలో జనం వచ్చారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఐదు గేట్ల ఎత్తివేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES