Wednesday, April 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్దళిత రత్న అవార్డు అందుకున్న గాడేకర్ పరశురామ్ మాంగ్

దళిత రత్న అవార్డు అందుకున్న గాడేకర్ పరశురామ్ మాంగ్

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహనీయులు డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురామ్ మాంగ్‌కు సమాజ సేవలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డును ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న అనంతరం పరశురామ్ మాంగ్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకే కాకుండా మాంగ్ సమాజ్ మొత్తం కృషికి దక్కిన గుర్తింపని తెలిపారు. ఈ అవార్డు కోసం తన పేరును ప్రతిపాదించిన మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత సేవ చేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -