హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోన్నట్లు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని ఆ కంపెనీ ఎండీ, సీఈఓ జి శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కీలక జిల్లాల్లో 14 ఆఫీసులను ప్రారంభించాలని, 10,000 మంది పైగా బీమా ఏజంట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక్కడ నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలను, అందరికీ అందుబాటులోకి తేవాలన్న కంపెనీ లక్ష్య సాధన దిశగా ఈ వ్యూహాత్మక విస్తరణ చేపడుతున్నామన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, సమ్మిళితమైన, అందరికీ అందుబాటులో ఉండే విధమైన, పటిష్టమైన ఆరోగ్య బీమా వ్యవస్థను నిర్మించాలనేది తమ లక్ష్యమన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ
- Advertisement -
- Advertisement -