Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల్లో చదువుతోపాటు ఆటలు ముఖ్యమే: ఎస్ఐ అనిల్ రెడ్డి 

పాఠశాలల్లో చదువుతోపాటు ఆటలు ముఖ్యమే: ఎస్ఐ అనిల్ రెడ్డి 

- Advertisement -

– క్రీడల వల్ల గుర్తింపు… నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి
– జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థి సౌమిత్ కు  అభినందన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
పాఠశాలల్లో చదువుతోపాటు ఆటలు ఎంతో ముఖ్యమని, అది సెగ పాఠశాల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. చదువు మాత్రమే ముఖ్యం కాదని, చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడితే క్రీడాకారుడికి సమాజంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుందన్నారు.శనివారం మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఉప్లూర్ గ్రామానికి చెందిన యెనుగందుల సౌమిత్ జాతీయ స్థాయి అండర్-19, ఫిఫ్టీ బాల్ క్రికెట్ కు ఎంపికైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి అండర్-19, ఫిఫ్టీ బాల్ క్రికెట్ కు ఎంపికైన సౌమిత్ ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి చెందిన సౌమిత్ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి కీరాకారుడుగా ఎంపికవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. చదువుతోపాటు ఆటలు ఉంటే శారీరకంగా దృఢంగా ఉండడంతోపాటు మానసికంగా బలంగా ఉంటామన్నారు. ప్రస్తుత రోజుల్లో ఎందరో ఎలాంటి కారణాలు లేకుండానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మానసికంగా బలంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. దీనికి సెల్ ఫోన్ వాడకం అధికం అవ్వడం కూడా ఒక కారణం అన్నారు. ప్రస్తుత పిల్లలు గేమ్స్ ను గ్రౌండ్ లో ఆడే ఆటలు కాకుండా ఫోన్లలో ఆడుతున్నారన్నారు. గ్రౌండ్లో ఆడాల్సిన ఆటలు ఫోన్లో ఆడడం వల్ల రెండు మూడు తరగతిల పిల్లలకే సోడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయన్నారు. మా జనరేషన్ వాళ్ళం ఏదో వచ్చిన ఎదుర్కొంటున్నామని, అందుకు ప్రతిరోజు ఆటలు ఆడడమే ముఖ్య కారణమని గుర్తు చేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటను ఎంపిక చేసుకోవాలని ఎస్ఐ సూచించారు.

ఎంచుకున్న ఆటను ఎప్పుడు ఆడుతూ ఉండాలని, అప్పుడే మానసికంగా బలంగా తయారవుతారు అన్నారు. ప్రస్తుత పిల్లలు గేమ్స్ గురించి అడిగితే ఫోన్లో గేమ్స్ అనుకుంటున్నారని, అంతలా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యారని విచారం వ్యక్తం చేశారు. చదువుతోపాటు ఏదో ఒక క్రీడను ఎంచుకుంటే ఫిజికల్ గా ఫిట్, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల మనకు గుర్తింపు, గౌరవం రావడంతో పాటు యూనిటీ పెరుగుతుందన్నారు. క్రీడల్లో కులం, మతం ఉండదని.. కుల మతాలకు అతీతంగా క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఎన్నుకుంటారన్నారు. క్రీడల వల్ల ఎక్కడెక్కడి నుండో వచ్చే వారితో పరిచయాలు పెరుగుతాయి అన్నారు. క్రీడల వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని, నడవడిక మారిపోతుందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగం చేస్తే నిర్ణయాలు తీసుకునే తీరులో, నాయకత్వ లక్షణంలో క్రీడాకారులకు ఇతరులకు చాలా తేడా ఉంటుందన్నారు. క్రీడాకారుల నాయకత్వ లక్షణం చాలా బాగుంటుందన్నారు.

ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాల్సిన అవసరం లేదని, ఏదో ఒక క్రీడను ఎన్నుకొని ఎవరికి వారు బలంగా ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని పాఠశాల యాజమాన్యానికి ఎస్ఐ అనిల్ రెడ్డి సూచించారు. జాతీయ స్థాయి అండర్-19, ఫిఫ్టీ బాల్ క్రికెట్ కు ఎంపికైన సౌమిత్ భవిష్యత్తులో ఇండియా టీం తరపున ఆడేలాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సౌమిత్ ఆటోగ్రాఫ్ కోసం మనమంతా ఎదురుచూసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సౌమిత్ జాతీయస్థాయి వరకు ఎదిగేందుకు తోడ్పాటు అందించిన వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్ ను ఈ సందర్భంగా ఎస్ఐ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -