Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆటపాటలు సామాజిక ఆయుధాలు

ఆటపాటలు సామాజిక ఆయుధాలు

- Advertisement -

నృత్యం ద్వారా సామాజిక భావాలను ప్రజలకు చేరవేయాలి :కొవిదా ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు పి.అనూహ్యారెడ్డి
ఎస్‌వీకేలో ఇండియన్‌ డాన్స్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌

నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఆటపాటలు సామాజిక ఆయుధాలని, నృత్యం ద్వారా సామాజిక ప్రయోజనంతో కూడిన భావాలను ప్రజలకు చేరవేయాలని కొవిదా ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు పి.అనూహ్యారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చినుకు ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ, తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, చినుకు ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు పీఎన్‌ మూర్తి అధ్యక్షతన ఇండియన్‌ డాన్స్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శాస్త్రీయ నృత్యాలు చూసి ఆనందించడం కోసం కాదని, సామాజిక ప్రయోజనంతో కూడిన భావాన్ని ప్రజలకు అర్థం చేయించగలగాలని అన్నారు. శాస్త్రీయ నృత్యాలు సామాన్యులకు చేరువ చేయడమే సాంస్కృతిక లక్ష్యంగా ఉండాలన్నారు. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్య క్షులు మాట్లాడుతూ.. భరతనాట్యం, కూచిపూడి, మోహిని ఆటం, కథక్‌, కథాకళి లాంటి నృత్యాలను మన దేశానికే పరిమితం చేయకుండా విదేశా ల్లోనూ ప్రదర్శించాలని సూచించారు. విదేశాల్లో ఉన్న ఆర్ట్‌ ఫామ్స్‌ను కూడా మనం వీక్షించాలని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలన్నారు. ప్రతి నృత్యాన్నీ నిరంతరం ఆధునీకరించడం ఒక అలవాటుగా మారాలన్నారు.

వివిధ ప్రదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేస్తే ఒక ఆత్మవిశ్వాసం, పరిపక్వత ఉన్నతి పెరుగుతుందని చెప్పారు. పీఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. భరతనా ట్యం, కూచిపూడి లాంటి నృత్యాలను అర్బన్‌ స్ట్రీట్‌ స్టైల్‌లోకి కూడా తీసుకురావాలని, ప్రజాపాటలకు నృత్య నిరాజనం లాంటి ప్రదర్శనలు విరివిగా ఇవ్వాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్ర లను నృత్య రూపకాలుగా తయారు చేసినప్పుడే ప్రజలు కళలను, కళాకారులను గుర్తుంచుకుం టారని, ప్రోత్సహిస్తారన్నారు. పిల్లల్లో అసమాన ప్రతిభ పాటవాలు ఉన్నాయని, వారి ప్రతిభను, సృజనను వెలికి తీయడం కోసం అనేక వేదికల అవసరమన్నారు. ఇండియన్‌ క్లాసికల్‌ అండ్‌ ఫోక్‌ నృత్యాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉందని, వాటిని ప్రభుత్వాలు కూడా నిరంతరం ప్రోత్సహించాలని కోరారు. నృత్యాలు ప్రదర్శించిన పిల్లలందరికీ సర్టిఫికెట్‌ మెమోంటో లిచ్చి అభినందించారు. నృత్య గురువులకు గురు వందనం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్‌ శ్రీరామ్‌, దత్తు, డా|| పి.జానకిదేవి, ఆచార్య ఘంటసాల పవన్‌కుమార్‌, ఆచార్య చినుకు కోర్‌ గ్రూప్‌ జి.లావణ్య, కె.రామలక్ష్మి, డి.రాధిక శ్రీని వాస్‌ కె.స్వర్ణలత ఏ.అనుదీప్తి, సీహెచ్‌. వీరభద్ర రావు, అరుణ, శ్రీనివాస్‌, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -