జిల్లా యువజన క్రీడల అధికారి కే ధనంజనేయులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహిళ దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల అధికారి కె ధనంజనేయులు, తెలంగాణ రాష్ట్ర గజేటెడ్ అధికారుల అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎం ఉపేందర్ రెడ్డి సమక్షం లో 18 రకాల ఫన్నీ గేమ్స్ ప్రణాళికను వివిధ జిల్లా మహిళా అధికారుల సమక్షం లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 40 సంవత్సరాల పైబడిన వారికి టేన్ని కైట్ , మ్యూజికల్ చైర్, చెస్, క్యారం స్వీట్ వాక్ స్కిప్పింగ్ రేస్ తో 18 రకాల గేమ్స్ నిర్వహించినట్లు తెలిపారు.
వివిధ రకాల గేమ్స్ యొక్క షెడ్యూల్ ప్రోఫోర్మ జిల్లా అధికారుల వాట్సాప్ ఎక్సెల్ షీట్ లో పేర్లను నమోదుచేసుకో వలని ఎం ఉపేందర్ రెడ్డి కోరారు. జిల్లా మహిళ ఉద్యోగులు అధిక సంఖ్యలో పెర్లని నమోదు చేసుకొని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమని విజయవంతం చేయాలని కోరారు. ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ దశరథ్ రెడ్డి , పిడి రఘువీర్ సింగ్, పిడి సంగీత , శైలజ , శ్రీకాంత్ , శేఖర్, యువజన సంఘల నాయకుడు కరుణ్ , కార్యాలయ సిబ్బంది మురళి, రేఖ, శ్రీనివాస్, వివిధ డిపార్ట్మెంట్ లో గల మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.



