నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అంకోజి గణతేజ సీఎం కప్ రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. ఈ నెల 14న ఆర్మూర్ మినీ స్టేడియం వేదికగా జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గణతేజ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ వేముల నాగభూషణం తెలిపారు.
ఈనెల 17నుండి 20వ తేదీ వరకు హైదరాబాద్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలిలో జరగబోయే సీఎం కప్ రాష్ట్ర స్థాయి బేస్ బాల్ టోర్నమెంట్ గణతేజ పాల్గొంటాడని తెలిపారు. ఇందుకోసం సోమవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లినట్లు వివరించారు. పాఠశాల విద్యార్థి గణతేజ సీఎం కప్ రాష్ట్ర స్థాయి బేస్ బాల్ టోర్నమెంట్ కు ఎంపికవ్వడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న , సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీఎం కప్ మండల సీనియర్ ప్లేయర్ రాహుల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.



