Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్టూర్ లో ఘనంగా గాంధీ జయంతి

వెల్టూర్ లో ఘనంగా గాంధీ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామంలో గురువారం మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాతిపిత, స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు గాంధీ తత్త్వాలు, అహింసామార్గం ప్రాముఖ్యతను స్మరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య యాదవ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పొన్నగంటి బాల్ రెడ్డి, విఘ్నేష్ పూర్ మాజీ సర్పంచ్ రాజు, పెద్దలు బూషిరాజ్ మల్లయ్య, లింగమయ్య, వెంకటేష్, ప్రదీప్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, బాల్ రెడ్డి, గుద్దటి బాలరాజు, యాదయ్య సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -