నవతెలంగాణ – కామారెడ్డి
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర గాంధీ చిత్రపటానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ త్యాగం అపారమైనదన్నారు.
ఆయన అహింస, సత్యం, సామరస్య తత్వాలు నేటి తరానికీ మార్గదర్శకాలనీ, మనమంతా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తే సమాజంలో శాంతి, ఐకమత్యం మరింత బలపడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కే.నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ యస్. శ్రీనివాసరావు, జిల్లాలోని ఇన్ స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.