Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగాంధీ మెడికల్‌ కాలేజీ71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్‌ కాలేజీ71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

- Advertisement -

గాంధీ అల్యూమినీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

గాంధీ మెడికల్‌ కాలేజ్‌ీ 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆదివారం కళాశాల అల్యూమినీ అసోసియేషన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ అల్యూమినీ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ జీఆర్‌ లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య విద్యా అధ్యాపకులుగా పనిచేసి రిటైరైన ప్రొఫెసర్లు డాక్టర్‌ సుధారమణి, డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌, డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ను సన్మానించారు. గాంధీ మెడికల్‌ కాలేజీ వివిధ విభాగాల్లో యూజీ, పీజీ, సూపర్‌ స్పెషాలిటీల్లో ప్రతిభ కనబరిచి మెరిట్‌ సాధించిన 64 మంది వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను అందించారు. పేద వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వడానికి కొందరు పూర్వ విద్యార్థులు తమ వంతుగా రూ.20 లక్షల విరాళాలను సభా వేదికపై అల్యూమినీ అసోసియేషన్‌కి అందించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.వాణి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో కొన్ని విభాగాల్లో వైద్య పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పగానే అక్కడే ఉన్న పూర్వ విద్యార్థులు వాటిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం హర్షనీయమని అన్నారు. ఈ వేడుకల్లో అల్యూమినీ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ డి.రాజారెడ్డి, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ పీవీ.నందకుమార్‌ రెడ్డి, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ డాక్టర్‌ మహేష్‌, జీఎస్టీ అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ దొంతి, గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.ఇందిర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -