బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్
నవతెలంగాణ -ముధోల్
ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ కోరారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని జీ ఏం పంక్షన్ హాల్ లో బుధువారం నిర్వహించిన శాంతి కమిటి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోలాల ,వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగా కుండా శాంతి యుత వాతావరణంలో జరుపుకోని ఆదర్శంగా ఉండాలని సూచించారు.ప్రతి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల చెప్పిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిమజ్జనం కార్యక్రమం రోజు పోలీసులకు సహకరించాలన్నారు. పరిమితికి మించి డీజె సౌండ్లను పెట్టుకోవద్దని సూచించారు .ఎలాంటి గొడవలకు తావులే కుండా శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు.
పోలీసులు నిరంతరం గణేష్ మండపాల నిర్వాహకులకు అందుబాటు లో ఉంటామని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్కుట్ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరు కలిసిమెలిసి పండుగ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామఅభివృద్ధికమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి, అడిషినల్ ఎస్పీ అవినాష్ కుమారును , అలాగేఇటీవల ఉత్తమ అవార్డు అందుకున్న తహసిల్దార్ శ్రీలత, సీఐ మల్లేష్ ,ఎస్సై బిట్ల పెర్సెస్, పంచాయతీ కార్యదర్శి అన్వర్ ఆలీని. ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఉత్సవ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, అధ్యక్షులు రోళ్ల రమేష్, మాజీ సర్పంచ్ అనిల్, వీడిసి అధ్యక్షులు విఠల్, దశరథ్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు తాటేవార్ రమేష్, గడ్డం సుభాష్, మెత్రి సాయినాథ్, జాంబుల సాయిప్రసాద్, దేవోజి భూమేష్, ఉత్సవ క మిటీ సభ్యులు, గణపతి మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES