Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: డిఎస్పీ సూర్యనారాయణ 

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: డిఎస్పీ సూర్యనారాయణ 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం :వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత  వాతావరణంలో జరుపుకొని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ కోరారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల గణేశ్ మండలి నిర్వాహకులతో సోమవారం పోలీసులు నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… పలు సూచనలు చేశారు.   ప్రతి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిమజ్జనం రోజు పోలీసులకు సహకరించాలన్నారు. పరిమితికి మించి డీజే సౌండ్లను పెట్టుకోవద్దని, ఎలాంటి గొడవలకు తావులేకుండా శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. 

నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గణేష్‌ మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడటం, అసభ్యకర నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచే ప్రసంగాలు చేయడం, పాటలు పాడడటం నిషేధమన్నారు. ఈ కార్యక్రమం లో కాటారం సీఐ నాగార్జున రావు, మహాదేవపూర్ సీఐ బీ. వెంకటేశ్వర్ రావు, కాటారం ఎస్సైలు శ్రీనివాస్, రాజశేఖర్, మహముత్తరాం మహేందర్ కుమార్, మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్, పజాప్రతినిధులు ప్రజలు, తదితరులు హాజరైనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -