- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో బుధవారం గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన గణేష్ గ్రహానికి పూజలు నిర్వహించి ఉపాధ్యాయులు, విద్యార్థులు నృత్యాలు చేస్తూ పట్టణ శివారులోని సిద్ధ రామేశ్వర ఆలయ సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -