నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర శుక్రవారం శాంతియుతంగా ముగిశాయి. పస్రా సీఐ పత్తిపాక దయాకర్, ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాలు ఎటువంటి అనర్థాలు లేకుండా సాఫీగా జరిగాయి. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా చెరువుల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయకులను నిమజ్జనం చేశారు. రాత్రి వేళల్లో కూడా భక్తులకు సౌకర్యంగా ఉండేలా లైటింగ్ సదుపాయాలను అధికారులు ముందస్తుగానే అమర్చారు.
అదేవిధంగా, నీటి ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండేందుకు గజ ఈతగాళ్లను నియమించి, భద్రతా చర్యల్లో ఎలాంటి లోటు లేకుండా చూసారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడంతో గ్రామాలలో ఎక్కడా రద్దీ లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం ముగిసింది. తహసిల్దార్ సృజన్ కుమార్, చల్వాయి గౌరారం చెరువు దగ్గర కార్యదర్శి రాజశేఖర్, గోవిందరావుపేట కార్యదర్శి శంకర్ మరియు స్థానికులు పోలీసుల కృషిని అభినందిస్తూ, ప్రతిసారి ఇలాగే సురక్షిత వాతావరణంలో పండుగలు జరగాలని ఆకాంక్షించారు.
ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES