పోలీసు అధికారులు సిబ్బందితో శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లాలో ఈనెల 5వతేదీన వినాయక నిమజ్జనాలు భక్తిప్రపత్తులతో పరస్పర సహకారంతో శోభాయాత్రలు నిర్వహించి, గణపయ్యలకు జిల్లావ్యాప్తంగా ఘనమైన వీడ్కోలు పలుకుదామని జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు. గణేశ్ నవరాత్రులు ముగించుకొని వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంచనియా సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. గురువారం వనపర్తి పట్టణం నల్లచెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాన్ని, నిమజ్జన శోభయాత్ర జరిగే రూట్ ను జిల్లా ఎస్పీ గారు ఇతర ప్రభుత్వశాఖల అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జన సమయంలో పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసు పికెట్లు, ఇతర ప్రభుత్వశాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు, ప్లడ్ లైట్లు, క్రేన్లు, మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజఈతగాళ్ల అందుబాటులో ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరిగింది అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఉంటుందన్నారు.
గణేష్ ఉత్సవ కమిటీలు త్వరితగతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చిన్న పిల్లలు మహిళలు శోభ యాత్రలో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని అలాగే ట్రాక్టర్ల, లారీలపై, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కాళ్లు చేతులు క్రిందకు వేలాడస్తు ప్రయాణం సాగించవద్దని పొరపాటున కాలుజారి పడిపోతే ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. నిమజ్జనం సమయంలో, క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసే సమయంలో యువత చిన్నారులు మహిళలు అప్రమత్తంగా ఉండాలని సహాయకులు అందుబాటులో ఉండాలని అన్నారు .నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు.
ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసువారి సూచనలను పాటించాలని కోరారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వెంకటేశ్వర్లు, వనపర్తి సీఐ, కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
నల్లచెరువు నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ రావుల గిరిధర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES